20 ఏళ్లుగా పార్టీని పట్టి పీడిస్తున్నారు.. ఇకనైనా వెళ్లిపోండి: ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్, 19 ఫిబ్రవరి (హి.స.) బీజేపీ కోవర్టులపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన హైదరాబాదులో మీడియాతో మాట్లాడుతూ.. 20 ఏళ్లుగా పార్టీని పీడిస్తున్నవారు వెళ్లిపోవాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తర తెలంగాణలో బీజ
అరవింద్


హైదరాబాద్, 19 ఫిబ్రవరి (హి.స.)

బీజేపీ కోవర్టులపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన హైదరాబాదులో మీడియాతో మాట్లాడుతూ.. 20 ఏళ్లుగా పార్టీని పీడిస్తున్నవారు వెళ్లిపోవాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తర తెలంగాణలో బీజేపీ బలపడింది. దక్షిణ తెలంగాణలో బీజేపీ బలోపేతం కావాల్సి ఉందని అర్వింద్ అభిప్రాయపడ్డారు. బీజేపీపై కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని కొట్టిపారేశారు. ఎవరి వల్ల ఎవరు భూస్థాపితం అయ్యారో మీకు తెలియదా? అని కవితను ప్రశ్నించారు. నిజామాబాద్ లో బీఆర్ఎస్కు కాంగ్రెస్ మద్దతు ఇచ్చిందని తెలిపారు. కేసుల కోసమే బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు కలిసి ఉండలేరని అన్నారు.

ఇదిలా ఉంటే.. ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో.. స్వల్ప తేడాతో నిజామాబాద్ లో బీజేపీ ఓటమి పాలయ్యింది. ఎంఐఎంతో కలిసి మేయర్ పీఠాన్ని కాంగ్రెస్ దక్కించుకుంది. నిజామాబాద్లో 17 స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్.. ఎంఐఎం (14 డివిజన్లు), ఇద్దరు ఎక్అఫీషియో సభ్యులు, మరో బీఆర్ఎస్ అభ్యర్థి మద్దతుతో సంఖ్యా బలాన్ని 34కి చేర్చుకుంది. బీజేపీ 28 స్థానాల్లో విజయం సాధించింది. అయితే కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు కలవడంతో బీజేపీకి మేయర్ పీఠం దక్కలేదు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande