కర్రెగుట్టల్లో కాల్పుల మోత.. ఎన్కౌంటర్లో ఐదుగురు మావోయిస్టులు మృతి
చతిస్గడ్, 19 ఫిబ్రవరి (హి.స.) తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని దట్టమైన అటవీ ప్రాంతమైన కర్రెగుట్టల్లో గురువారం ఉదయం భారీ ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. భద్రతా దళాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఈ భీకర ఎదురుకాల్పుల్లో మావోయిస్టులు ఇప్పటి వరకు ఐదుగురు మ
Encounter


చతిస్గడ్, 19 ఫిబ్రవరి (హి.స.)

తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని

దట్టమైన అటవీ ప్రాంతమైన కర్రెగుట్టల్లో గురువారం ఉదయం భారీ ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. భద్రతా దళాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఈ భీకర ఎదురుకాల్పుల్లో మావోయిస్టులు ఇప్పటి వరకు ఐదుగురు మరణించినట్లుగా ప్రాథమిక సమాచారం అందుతోంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.

కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న 'నక్సల్ రహిత భారత్' లక్ష్యంలో భాగంగా చేపట్టిన 'ఆపరేషన్ కగార్-2'లో భాగంగా కూబింగ్ ఆపరేషన్ చేపడుతుండగా.. ఇవాళ ఎదురు కాల్పులు తెల్లవారుజామున ప్రారంభమయ్యాయి. కర్రెగుట్టలు మావోయిస్టులకు కీలకమైన స్థావరం కావడంతో పక్కా సమాచారంతో సీఆర్పీఎఫ్ (CRPF), కోబ్రా (COBRA), గ్రేహౌండ్స్, డీఆర్జీ (DRG) దళాలు సంయుక్తంగా ఈ ఆపరేషనన్ను చేపట్టాయి. సుమారు 5 వేల మంది భద్రతా సిబ్బంది ఈ ఆపరేషన్లో పాల్గొంటున్నారు. మావోయిస్టు పార్టీ అగ్రనేతలు దేవ్, బడే చొక్కారావు వంటి వారు ఈ ప్రాంతంలోనే తలదాచుకున్నారన్న సమాచారంతో బలగాలు అడవిని జల్లెడ పడుతున్నాయి. తెల్లవారుజామున బలగాలకు మావోయిస్టులు తారసపడటంతో ఇరువర్గాల మధ్య కాల్పులు మొదలయ్యాయి. అడవి లోపల ఇంకా ఎదురుకాల్పులు సమాచారం. అయితే, కొనసాగుతున్నట్లుగా మరణించిన ఐదుగురు మావోయిస్టుల గుర్తింపు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ మేరకు ఎన్కౌంటర్లో స్పాట్లో భారీగా ఆయుధాలు, విప్లవ సాహిత్యం స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande