
మిర్యాలగూడ, 19 ఫిబ్రవరి (హి.స.)నిరుపేదలు అభివృద్ధి చెందడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా పనిచేస్తుందని మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. గురువారం మండలంలోని సల్కునూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తుందని అన్నారు.
అందులో భాగంగా నిరుపేదలకు 3500 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసినట్లు తెలిపారు. దీంతో పేదింటి కల నెరవేరినట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల వలన ప్రజలు ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని అన్నారు. త్వరలో రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రావు ఎల్లారెడ్డి, రేగటి రవీందర్ రెడ్డి, పుట్టల కృపయ్య, స్థానిక సర్పంచి సతీష్, ఆమనగల్లు సర్పంచి సందీప్, చక్కని ఉపేంద్ర సత్యం పాల్గొన్నారు. తదితరులు
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు