మార్చి 15లోపు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తాం: పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
న్యూఢిల్లీ, 19 ఫిబ్రవరి (హి.స.) మార్చి 15లోపు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామని తెలంగాణ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ పెద్దలతో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ మంత్రులందరితోనూ కాంగ్రెస్ అగ్రనాయకులు సమా
మహేష్ కుమార్


న్యూఢిల్లీ, 19 ఫిబ్రవరి (హి.స.)

మార్చి 15లోపు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామని తెలంగాణ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ పెద్దలతో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ మంత్రులందరితోనూ కాంగ్రెస్ అగ్రనాయకులు సమావేశం అయ్యారని చెప్పారు. పార్టీ నిర్మాణం గురించి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి చర్చించినట్టు తెలిపారు. ఉపఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై రాహుల్ గాంధీ అభింనందించారని చెప్పారు. ప్రజలు సంక్షేమాన్ని ఆస్వాదిస్తున్నారు కాబట్టే పార్టీని ఆశీర్వదించారని అన్నారు. రాష్ట్రంలో 80శాతం ప్రజలు తమకు మద్దతు ఇచ్చారన్నారు. రాహుల్ గాంధీ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ విధి విధానాల గురించి అడిగి తెలుసుకున్నారని తెలిపారు. మార్చి 15లోపు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామని వెల్లడించారు. అంతే కాకుండా రాజగోపాల్ రెడ్డి అంశం గురించి చర్చించామని అన్నారు. త్వరలోనే రాజగోపాల్ రెడ్డిని పిలిచి మాట్లాడతామని స్పష్టం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande