
పెద్దపల్లి, 19 ఫిబ్రవరి (హి.స.)
పెద్దపల్లి జిల్లా లోని క్యాతనవల్లి మున్సిపాలిటీలో
మంగళవారం మంత్రి వివేక్ వెంకటస్వామి కారు పై జరిగిన దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే, జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు బాల్క సుమన్ను బుధవారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచిన విషయం తెలిసిందే. జూనియర్ సివిల్ జడ్జి జి. కవిత 14 రోజులు ఆదిలాబాద్ జైలులో రిమాండ్ విధించడంతో జిల్లా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అరెస్ట్ను నిరసిస్తూ గురువారం బంద్ ప్రకటించారు. జిల్లాలో బంద్ ప్రభావంతో ప్రధాన నగరాలైన పెద్దపల్లి మందమర్రి రామగుండం గోదావరిఖని తదితర పట్టణాలలోని మార్కెట్ వ్యాపారులు, దుకాణదారులు, పాఠశాలలు బంద్లో పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ప్రధాన కూడళ్లలో గస్తీ కాస్తూ, పోలీసు వాహనాల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు