
హైదరాబాద్, 19 ఫిబ్రవరి (హి.స.)
పాల్గొన్న స్పెషల్ సిఎస్ వికాస్ రాజ్,ఈఎన్సి లు మోహన్ నాయక్,జయ భారతి,సి.ఈ లు శ్రీనివాస్ రెడ్డి,రాజేశ్వర్ రెడ్డి,వసంత్ నాయక్,బి.వి రావు,లింగారెడ్డి,నర్సింగ్ రావు, పలువురు ఆర్ అండ్ బి అధికారులు..
గత ఏడాది బడ్జెట్... పనుల పురోగతి..విడుదలైన నిధులపై కూలంకషంగా చర్చించిన మంత్రి..
*రాష్ట్ర అభివృద్ధిలో రోడ్లు భవనాలు శాఖ ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది.
స్పష్టమైన ప్రణాళికతో వార్షిక బడ్జెట్ ఎస్టిమేట్స్ ఉండాలి
రీజినల్ రింగ్ రోడ్డు లాంటి గేమ్ చేంజర్ ప్రాజెక్టులపై ప్రధాన దృష్టి సారించాలి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 2047 రైసింగ్ తెలంగాణ నినాదంలో రాష్ట్ర రోడ్ నెట్వర్క్ అభివృద్ధి అత్యంత కీలకం...
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర రోడ్ నెట్వర్క్ అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి పెట్టారు..
హ్యామ్ రోడ్ల నిర్మాణంతో రాష్ట్ర వ్యాప్తంగా అద్దం లాంటి రోడ్లు నిర్మించబోతున్నాం..
ఇప్పటికే ఉన్న బాలారిష్టాలు దాటేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేశాం..అధికారులు కూడా మనసుపెట్టి పనిచేయాలి.
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నిధుల వాటాపై కన్ఫ్యూజన్ లేకుండా పారదర్శకంగా వ్యవహరించాలి..
హైదరాబాద్-విజయవాడ (NH 65) 8లేన్ విస్తరణ పనులు కూడా త్వరలో ప్రారంభం కానున్నాయి.
పనులు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ గారిని మరోసారి కోరతా..
తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎంతో ఉపయోగకరమైన రోడ్డు...ఇది పూర్తయితే హైదరాబాద్ నుండి విజయవాడ రెండున్నర గంటల్లో చేరుకోవచ్చు
రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా కేంద్ర సహకారం అందించే ప్రాజెక్టుల్లో వేగం పెంచాలని కేంద్ర మంత్రులను కలుస్తాను..
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు