ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు ఆక్షేపణ
ఢిల్లీ,19 ,ఫిబ్రవరి (హి.స.) ఎన్నికల ముందు ఉచిత పథకాలపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పంచుకుంటూ పోతే అభివృద్ధికి ఒక్క పైసా కూడా మిగలదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా అందరికీ ఉచిత విద్యుత్
Supreme Court


ఢిల్లీ,19 ,ఫిబ్రవరి (హి.స.) ఎన్నికల ముందు ఉచిత పథకాలపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పంచుకుంటూ పోతే అభివృద్ధికి ఒక్క పైసా కూడా మిగలదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా అందరికీ ఉచిత విద్యుత్ అందిస్తామని స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే పార్టీ ప్రకటించింది. దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. గురువారం ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలో ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా రాష్ట్రాల్లో అమలవుతున్న ఉచిత పథకాలను ధర్మాసనం తీవ్రంగా తప్పుపట్టింది.

ఉచిత విద్యుత్ హామీకి నిధులు ఎక్కడి నుంచి తెస్తారో సమాధానం దాఖలు చేయాలని తమిళనాడు ప్రభుత్వానికి ఆదేశించగా.. కేంద్రానికి నోటీసు జారీ చేసింది. ఎన్నికల్లో గెలిచేందుకు ఆహారం, ఉచిత్ విద్యుత్ అందిస్తామంటే వాస్తవ పరిస్థితికి నిధులు ఎలా సమకూర్చుతారో చెప్పాలని డిమాండ్ చేసింది. అయినా ఆర్థిక స్థోమత ఉన్నవారికి కూడా ఉచితంగా ఇస్తామని చెప్పడం ఇదే సంస్కృతి అని ప్రశ్నించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande