
ముంబయి,19 ,ఫిబ్రవరి (హి.స.) భారతీయ స్టాక్ మార్కెట్లు తీవ్రమైన అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. మధ్యాహ్నం ఒంటిగంట సమయానికి సూచీలు భారీగా పడిపోయాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 800 పాయింట్లు పతనమైంది. ఈ ఉదయం 83,969.82 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ ఒకానొక దశలో 82,943.49 కనిష్ఠ స్థాయికి పడిపోయింది.
ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 (NIFTY 50) కూడా 230 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. ఉదయం 10:12 గంటల సమయంలో 25,771 వద్ద ఉన్న నిఫ్టీ.. మధ్యాహ్నానికి మరింత బలహీనపడింది. స్టాక్ మార్కెట్లు నష్టపోతున్న తరుణంలో బంగారం ధరలు సానుకూలంగా కదులుతున్నాయి. మార్కెట్ కీలక సపోర్ట్ స్థాయిల కంటే కిందకు పడిపోవడంతో ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ