ఈనెల 26 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు..?
తెలంగాణ, 19 ఫిబ్రవరి (హి.స.) తెలంగాణ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలకు రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఈనెల 26 నుంచి అసెంబ్లీ (Assembly) సమావేశాలను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం సూచనాప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. అయితే, ఇందుకు సంబం
Assembly


తెలంగాణ, 19 ఫిబ్రవరి (హి.స.) తెలంగాణ రాష్ట్ర శాసనసభ బడ్జెట్

సమావేశాలకు రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఈనెల 26 నుంచి అసెంబ్లీ (Assembly) సమావేశాలను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం సూచనాప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. అయితే, ఇందుకు సంబంధించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈనెల 23న కేబినెట్ సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది. ఈ మేరకు కసరత్తు పూర్తి చేసిన ఆర్థిక శాఖ వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలకు తుది మెరుగులు దిద్దుతోంది. ఇక ఆర్థిక మంత్రి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) ఈ నెల 28 న శాసనసభలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. గత బడ్జెట్ కంటే ఈసారి కేటాయింపులు భారీగా ఉండే అవకాశం ఉందని సమాచారం. ముఖ్యంగా సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పనకు ఈ బడ్జెట్లో పెద్దపీట వేయనున్నట్లు తెలుస్తోంది. బడ్జెట్పై సమగ్రంగా చర్చించేందుకు వీలుగా సమావేశాలను 15 రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. సభలో ప్రతిపక్షాలు లేవనెత్తే అంశాలకు సమాధానం ఇవ్వడంతో పాటు, పలు కీలక బిల్లులను కూడా ఈ సమావేశాల్లోనే ఆమోదించుకోవాలని అధికార పక్షం భావిస్తోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande