
హైదరాబాద్, 19 ఫిబ్రవరి (హి.స.)
రాష్ట్రంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాల (IDOC) ప్రాంగణాల్లో తెలంగాణ తల్లి విగ్రహాలను ప్రతిష్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనాపరమైన అనుమతులు మంజూరు చేస్తూ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాల్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ కాంప్లెక్స్ (IDOC) ప్రాంగణాల్లో ఈ విగ్రహాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం రూ.5,80,00,000 కోట్లు కేటాయిస్తూ బడ్జెట్ విడుదల ఉత్తర్వులను (BRO) జారీ చేసింది. ఈ పనులను రోడ్లు, భవనాల శాఖ (T,R&B Dept) ఆధ్వర్యంలో చేపట్టనున్నారు. తెలంగాణ అస్తిత్వానికి, సంస్కృతికి ప్రతీకగా నిలిచే తెలంగాణ తల్లి విగ్రహాలను ప్రతి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన పరిపాలనాపరమైన అనుమతులు లభించడంతో త్వరలోనే విగ్రహాల తయారీ, ప్రతిష్టాపన పనులు ప్రారంభం కానున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు