ప్రజల తెలంగాణ” లక్ష్యం దిశగా చర్చలు!
హైదరాబాద్, 19 ఫిబ్రవరి (హి.స.) ఢిల్లీలోని మల్లికార్జున ఖర్గే నివాసంలో తెలంగాణ కాంగ్రెస్‌కు సంబంధించిన కీలక సమీక్ష సమావేశం ముగిసింది. ఈ సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌తో
ప్రజల తెలంగాణ” లక్ష్యం దిశగా చర్చలు!


హైదరాబాద్, 19 ఫిబ్రవరి (హి.స.)

ఢిల్లీలోని మల్లికార్జున ఖర్గే నివాసంలో తెలంగాణ కాంగ్రెస్‌కు సంబంధించిన కీలక సమీక్ష సమావేశం ముగిసింది. ఈ సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌తో పాటు పలువురు మంత్రులు శ్రీధర్ బాబు, కోమటి రెడ్డి వెంకట రెడ్డి, దామోదర రాజనర్సింహా, అడ్లూరి లక్ష్మణ్, అజహరుద్దీన్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, సీతక్క, కొండా సురేఖ, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వ రెండేళ్ల పాలనపై ప్రోగ్రెస్ రిపోర్ట్, పార్టీ ప్రస్తుత పరిస్థితులు, ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలు, భవిష్యత్ కార్యాచరణ వంటి అంశాలపై సమగ్రంగా చర్చ జరిగింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande