ఏపీ శాసనమండలి మళ్లీ వాయిదా
అమరావతి, 19 ఫిబ్రవరి (హి.స.)ఏపీ శాస‌న‌మండ‌లి మ‌ళ్లీ వాయిదాప‌డింది. ఇందాపూర్ డెయిరీ వివాదంపై వైసీపీ చ‌ర్చ‌కు ప‌ట్టుప‌ట్టింది. ఈ క్ర‌మంలో స‌భ‌లో వైసీపీ నాయ‌కులు విజిల్స్ వేశారు. చైర్మ‌న్ విజిల్స్ వేయ‌వ‌ద్ద‌ని వాదించినప్ప‌టికీ వైసీపీ నాయ‌కులు విన‌లేదు
శాస‌న‌మండ‌లి


అమరావతి, 19 ఫిబ్రవరి (హి.స.)ఏపీ శాస‌న‌మండ‌లి మ‌ళ్లీ వాయిదాప‌డింది. ఇందాపూర్ డెయిరీ వివాదంపై వైసీపీ చ‌ర్చ‌కు ప‌ట్టుప‌ట్టింది. ఈ క్ర‌మంలో స‌భ‌లో వైసీపీ నాయ‌కులు విజిల్స్ వేశారు. చైర్మ‌న్ విజిల్స్ వేయ‌వ‌ద్ద‌ని వాదించినప్ప‌టికీ వైసీపీ నాయ‌కులు విన‌లేదు. గోవిందా గోవిందా అంటూ నినాదాలు చేశారు. వైసీపీ నేత‌ల ఆందోళ‌న‌ల నేప‌థ్యంలో మ‌ళ్లీ స‌భ‌ను వాయిదా వేశారు. ఇక నిన్న సైతం స‌భ వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే. తిరుప‌తి ల‌డ్డూలో ఉప‌యోగించిన నెయ్యి క‌ల్తీ ఆరోప‌ణ‌ల‌పై చ‌ర్చ కోసం వైసీపీ ఎమ్మెల్సీలు ఇచ్చిన తీర్మానాల‌ను చైర్మ‌న్ కొయ్యే మోషేన్ రాజు తిర‌స్క‌రించారు. మ‌రోవైపు వైసీపీ ఎమ్మెల్సీలు నిన్న కూడా ఇందాపూర్ డైయిరీ పేరుతో టీటీడీకి స‌ర‌ఫ‌రా చేసిన నెయ్యిపై చ‌ర్చ‌కు డిమాండ్ చేస్తూ వాయిదా తీర్మానాలు ప్ర‌వేశ‌పెట్టారు. ఈ తీర్మానాల‌ను తిర‌స్కిరంచారు. దీంతో వైసీపీ ఎమ్మెల్సీలు ఆందోళ‌న చేప‌ట్టారు. స‌భ‌లో గంద‌ర‌గోళం నెల‌కొన‌డంతో కొద్దిసేపు వాయిదా వేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande