
తిరుమల, 19 ఫిబ్రవరి (హి.స.)
తిరుమల దర్శనానికి వచ్చిన కన్నడ యువతులు తెలుగును కించపరుస్తూ రీల్స్ చేశారు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సాధారణంగా ఒక భాషలోని పదాలకు మరో భాషలో ఎలాంటి అర్థాలైనా ఉండొచ్చు. అలాగే తెలుగులో రండి అనే పదానికి హిందీలో బూతు అర్థం వస్తుంది. అయితే క్యూలైన్ లో కన్నడ యువతులు ఆ పదాలను విన్నారో ఏమోగానీ వాటి అర్థం తెలిసి కూడా స్వామివారి సన్నిధిలోనే రీల్స్ చేశారు.
రండి అంటే తెలుగులో come అని అర్థం వస్తుంది. అయితే ఇదే పదానికి హిందీలో బూతు అర్థం వస్తుంది దీంతో తెలుగును కించపరిచేలా యువతులు రీల్స్ చేయడమే కాకుండా తిరుమలలో బూతులు మాట్లాడారు. వీడియోలో మాట్లాడుతున్న యువతి.. తాను రండి అని మరో అమ్మాయి జరగ రండి అని ఇంకో అమ్మాయి త్వరగా రండి అని చెప్పుకొచ్చింది. ఈ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతున్నాయి.
దీంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫన్నీగా రీల్స్ చేసినా తిరుమలలో ఇలాంటి రీల్స్ చేయడం ఏంటని మండిపడుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV