
గుంటూరు 20 ఫిబ్రవరి (హి.స.), , :సీఎంను బూతులు తిట్టి జైలుకు వెళ్లి బెయిల్‌పై వచ్చినా, వైసీపీ నేత అంబటి రాంబాబు తీరులో మాత్రం మార్పు లేదు. నిబంధనలకు అడ్డగోలుగా తూట్లు.. పోలీసులతో పదేపదే ఘర్షణ! గురువారం రాజమండ్రిలో మొదలైన అంబటి హైడ్రామా విజయవాడ ప్రకాశం బ్యారేజీ మీదుగా ర్యాలీగా గుంటూరు చేరేవరకు సాగి....ంది. బుధవారం రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటకు వచ్చిన ఆయన మరో వైసీపీ నేత జక్కంపూడి రాజా నివాసంలో బస చేశారు. భారీ ర్యాలీగా గుంటూరు చేరుకునేలా రోడ్‌మ్యా్‌పను ప్లాన్ చేశారు. గురువారం ఉదయం 9.30 గంటల సమయంలో గుంటూరు వెళ్లడానికి రాంబాబు బయటకు వచ్చారు. అప్పటికే వైసీపీ బల ప్రదర్శనలో భాగంగా కార్యకర్తలు, నాయకులు పెద్దఎత్తున గుమిగూడారు. 30 కార్ల వరకూ వరుస కట్టాయి. సీఐ బాజీలాల్ అక్కడకు చేరుకొని పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 అమలులో ఉందని, ర్యాలీలు, సభలు, సమా వేశాలు వంటివి నిర్వహించడానికి వీల్లేదంటూ నోటీసు ఇచ్చారు. వైసీపీ శ్రేణుల వల్ల శాంతి భద్రతలకు ఇబ్బంది కలగకుండా పోలీసులు స్టాపర్ బోర్డులను బారికేడ్ల మాదిరిగా పెట్టారు.
ఈలోపు రాజా ఇంటి వద్దకు సెంట్రల్ జోన్ ఇన్‌చార్జి డీఎస్పీ శ్రీకాంత్, ఎస్‌బీ డీఎస్పీ రామకృష్ణ, ధవళేశ్వరం సీఐ గణేశ్ తదితరులు చేరుకున్నారు. వాహన శ్రేణి విషయంలో డీఎస్పీతో రాంబాబు గొడవపడ్డారు. తన కారు వెంట మిగతా కార్లు ర్యాలీ మాదిరిగా రావడానికి అనుమతించాలంటూ వాగ్వా దానికి దిగారు. అందుకు అధికారి నిరాకరించడంతో ఆయనపై పెద్ద పెద్దగా కేకలు వేశారు. అయినా, ర్యాలీ మాదిరిగా వెళ్లడానికి ఎట్టి పరిస్థితు ల్లోనూ వీల్లేదని పోలీసులు స్పష్టం చేశారు. దీంతో కారు దిగి రెండు సార్లు పాదయాత్రగా వెళ్లడానికి రాంబాబు ప్రయత్నించారు. ఈ తంతు జరుగుతుండగా.. స్టాపర్ బోర్డులను రాజా పక్కకు నెట్టేశారు. వైసీపీ కార్యకర్తలు అరుపులు, నినాదాలు చేస్తూ, తోసుకుంటూ వెళ్లడంతో ఉద్రిక్త పరిస్థితి నెల కొంది. రాంబాబు రెండు చోట్ల కారుదిగి పాదయాత్రంటూ హల్ చల్ చేశారు. రాంబాబును కారులో ఎక్కించిన పోలీసులు రాజమండ్రి నుంచి సాగనంపారు. అయితే రోడ్ కం రైలు బ్రిడ్జి వద్దకు చేరుకునేసరికి రాంబాబు కాన్వాయ్ మాదిరిగా మళ్లీ 30కి పైగా కార్లు వరుసలో కలిశాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ