
అమరావతి, 20 ఫిబ్రవరి (హి.స.), :ఏపీ అసెంబ్లీ సమావేశాల ఏడో రోజు ప్రారంభమయ్యాయి. సభ మొదలైన వెంటనే డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు ప్రశ్నోత్తరాలను చేపట్టారు. గోదావరి పుష్కరాల సందర్భంగా నది కాలుష్యం జరగకుండా తీసుకునే చర్యలపై ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి నిమ్మల రామానాయుడు సమాధానమిచ్చారు. 2027 జూన్ 26 నుంచి జులై 7 వరకు 12 రోజుల పాటు గోదావరి పుష్కరాలు జరుగనున్నాయని తెలిపారు. ఈ పుష్కరాల్లో నది పవిత్రతను కాపాడటం సహా కాలుష్యాన్ని నియంత్రించేలా ప్రభుత్వం నిబద్ధతతో వ్యవహరిస్తుందని అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ