శ్రీకాళహస్తీశ్వరాలయం అద్భుతమైన శిల్ప సంపదకు నిలయం
అమరావతి, 20 ఫిబ్రవరి (హి.స.) శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయం అద్భుతమైన శిల్పసంపదకు నిలయమే కాదు.. ఎన్నో ప్రత్యేకతలకు నిదర్శనం కూడా. ఇక్కడి ఆలయాన్ని ఎందరో రాజులు, చక్రవర్తులు, జమిందార్లు ఎంతో అభివృద్ధి పరిచారు. అయితే ఇక్కడున్న ప్రత్యేకతలను పురాత
శ్రీకాళహస్తీశ్వరాలయం అద్భుతమైన శిల్ప సంపదకు నిలయం


అమరావతి, 20 ఫిబ్రవరి (హి.స.)

శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయం అద్భుతమైన శిల్పసంపదకు నిలయమే కాదు.. ఎన్నో ప్రత్యేకతలకు నిదర్శనం కూడా. ఇక్కడి ఆలయాన్ని ఎందరో రాజులు, చక్రవర్తులు, జమిందార్లు ఎంతో అభివృద్ధి పరిచారు. అయితే ఇక్కడున్న ప్రత్యేకతలను పురాతన కాలం నుంచి సంరక్షిస్తూనే వస్తున్నారు.

అవి.. చతుర్విద పురుషార్ధాలు..:ధర్మ, అర్ధ, కామ, మోక్షాలకు చతుర్విద పురుషార్ధాలుగా పిలుస్తారు. అయితే ఇవన్నీ ఒకే దగ్గర ఉండటం విశేషతను సంతరించుకుంటోంది. వాయులింగేశ్వరుని దర్శనార్థం వెళ్లే సమయంలో మహద్వారం ఎదురుగా ఉన్న నందీశ్వరుడు, బలిపీఠం, రాతిధ్వజస్తంభం, ధారుధ్వజస్తంభం వరుస క్రమంలో ఉండటం విశేషం. రెండు ధ్వజస్తంభాలు పక్కపక్కన ఉండటం, అందులో ఒకటి ఏక శిలా ధ్వజస్తంభంగా ఖ్యాతి పొందింది. ఇక్కడి ధ్వజస్తంభంపై ఒక్కో దిక్కున ఒక్కో దేవతా రూపం చెక్కబడి ఉన్నారు. దీనిపై ఉన్న వజ్రేశ్వరీ దేవి ప్రతిమ మరింతగా ఆకట్టుకోవడం విశేషం. శ్రావణ మాసంలో ఇక్కడి అమ్మవారికి విశేష అలంకరణలు చేపడతారు. ఇలాంటి ధ్వజస్తంభం దక్షిణ భారత దేశంలో ఎక్కడా కన్పించదు మరి. మరొకటి దారు ధ్వజస్తంభానికి బంగారు పూత వేయించడంతో మరింత సుందరంగా ఆకట్టుకుంది. ఇలా క్రమ పద్ధతిలో అమరినట్లు దేశంలో మరెక్కడా లేదన్న విషయాన్ని స్థల పురాణంలో విశద పరిచారు.

ఒక్కొక్కటి ఒక్కో ప్రాభవం..:దక్షిణామూర్తిని చూస్తూ నిత్యం ఆయన్ను సేవించుకుంటూ ఉన్న నందీశ్వరుని విగ్రహం ధర్మానికి ప్రతీకగా చెప్తారు. నంది విగ్రహం చిన్నపాటి మండపంలో కొలువుదీరి ఉంటుంది. ఇక వెనుక వైపున బలిపీఠం అర్ధమునకు, రాతి ధ్వజస్తంభం కామమునకు, స్వర్ణ ధ్వజస్తంభం మోక్షానికి ప్రతీకలుగా చెప్తుంటారు. మహద్వారం ఎదురుగా ఇవన్నీ ఏర్పాటై ఉండటం, అందులోనూ ఎంతో ముచ్చటగా భక్తులను ఆకట్టుకోవడం విశేషం. ఇలా చారిత్రాత్మకంగా, పురాణపరంగా ఇంతటి విషయ సమాచారం ఇక్కడే దాగుండటం విశేషం.

టికెట్‌ధర: రూ.216 ప్రవేశం: ఒకరికి, నిర్వహణ

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande