
అమరావతి, 20 ఫిబ్రవరి (హి.స.)భవానీపురం, భవానీపురం స్టేషన్ పరిధిలో ఇద్దరు బాలురు అదృశ్యం కావడం కలకలం సృష్టిస్తోంది. భవానీపురం కరూర్ వైశ్యా బ్యాంకు సమీపంలో దేవాసి కాలారామ్ నివాసం ఉంటూ.. ఆర్టీసీ వర్క్ షాపు రోడ్డులో హార్డ్‌వేర్ దుకాణాన్ని నిర్వహిస్తున్నారు. ఆయన కుమారుడు ఉమారామ్(14) స్థానికంగా ఉన్న ప్రైవేటు పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. వారి బంధువుల కుమారుడు దేవాసి బెహ్రారామ్(13) కూడా అతడితో పాటు చదువుకుంటున్నాడు. ప్రతి రోజు సాయంత్రం వారిద్దరూ ట్యూషన్‌కు వెళ్లి వస్తుంటారు. ఆ విధంగానే 18వ తేదీ సాయంత్రం కూడా ట్యూషన్‌కు వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి బయలుదేరి వెళ్లారు. రాత్రి 8 గంటలైనా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ట్యూషన్ వద్దకు వెళ్లి విచారించారు. ట్యూషన్‌కు రాలేదని చెప్పడంతో కంగుతిన్నారు. వెంటనే బస్టాండు, రైల్వేస్టేషన్, వన్‌టౌన్ ప్రాంతంలో రాత్రి 11:30 వరకు తిరిగి విచారించారు. పిల్లల ఆచూకీ తెలియకపోవడంతో భవానీపురం పోలీసులను ఆశ్రయించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ