
దిల్లీ 20 ఫిబ్రవరి (హి.స.)
దిల్లీలో జరుగుతున్న ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్-2026’లో ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం పాల్గొంటారు. రాష్ట్రాన్ని సాంకేతిక హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా అక్కడ పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారు. పలు సంస్థలతో ఒప్పందాలు చేసుకోనున్నారు. ఉదయం 9.30 గంటలకు ‘ఏఐ యాక్సిలరేటర్స్, ఫ్యూయలింగ్ ఇండియాస్ ఎకనమిక్ గ్రోత్’ అనే అంశంపై జరిగే సెషన్‌లో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ, కేంద్ర మంత్రి జితిన్‌ప్రసాద, టీసీఎస్ ప్రతినిధులతో కలిసి చంద్రబాబు పాల్గొంటారు. అనంతరం ఏఐ, క్వాంటమ్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ అంశాలపై రాష్ట్రంలోని పది లక్షల మంది యువతకు నైపుణ్యం కల్పించేలా ఐబీఎంతో, క్వాంటమ్-ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ కేంద్రం ఏర్పాటుకు యూనిసిస్ సంస్థతో ఒప్పందం చేసుకుంటారు. క్వాంటమ్ ఏఐ యూనివర్సిటీ ఏర్పాటు కోసం ఎన్‌ఐఈఎల్‌ఐటీతో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ చేసుకోనుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్యూటర్ ఏర్పాటుకు ఐఐటీ-మద్రాస్‌తో మరో ఒప్పందం కుదుర్చుకోనుంది. ఎన్విడియా భాగస్వామ్యంతో రాష్ట్రంలో ఏఐ లివింగ్ ల్యాబ్స్ ఏర్పాటుపైనా ప్రకటన చేయనున్నారు. క్వాంటెలా ఇంక్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ శ్రీధర్ గాంధీతో సీఎం సమావేశమవుతారు. మధ్యాహ్నం 12 గంటలకు ‘ఏఐ ద్వారా పోటీతత్వం’ అనే అంశంపై వరల్డ్ ఎకనమిక్ ఫోరం నిర్వహించే రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. ఇందులో కేంద్రమంత్రి అశ్వినీవైష్ణవ్, వరల్డ్ ఎకనమిక్ ఫోరం సీఈఓ బోర్జ్ బ్రెండేతో కలిసి సీఎం చర్చిస్తారు. సమావేశం
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ