
హైదరాబాద్, 20 ఫిబ్రవరి (హి.స.)దిల్లీలో జరుగుతున్న ఏఐ సదస్సులో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఏఐ శకం ఇప్పటికే మొదలైందని అన్నారు. ‘‘గతంలో పారిశ్రామిక విప్లవం వచ్చింది. ఇప్పుడు సాఫ్ట్‌వేర్ విప్లవం నడుస్తోంది. ఏఐ రంగంలో భారత్ గ్లోబల్ లీడర్‌గా ఎదగాలి. ఏఐ అభివృద్ధి కోసం ప్రత్యేకమైన వార్ రూమ్ ఏర్పాటు చేయాలి. ఏఐ వార్ రూమ్ కోసం హైదరాబాద్ ఎంతో అనువైన ప్రదేశం. హైదరాబాద్‌లో ఏఐ వర్శిటీని ఇప్పటికే సకల వసతులతో ఏర్పాటు చేశాం.
ఏఐ రంగంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయి. వాటిని భారత్ అందిపుచ్చుకోవాలి. ఏఐలో స్టార్టప్‌లను ప్రోత్సహించాలి. ప్రతి ఆరు నెలలకోసారి హైదరాబాద్ వంటి ప్రదేశంలో ఏఐ సదస్సులు జరగాలి’’ అని రేవంత్ అన్నారు. ప్రపంచంలోని టెక్నాలజీ దిగ్గజాలన్నీ ఈ సదస్సుకు వచ్చాయని, ఆలోచనలే మన జీవితాలను మార్చివేస్తాయని చెప్పారు. మనిషి అత్యున్నత ఆవిష్కరణ అయిన ఏఐ ఫలితాలు మన కోసం చూస్తున్నాయి. మనిషి కంటే ఏఐకి ఎక్కువ తెలివితేటలు ఉన్నాయి’’ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్