రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇవ్వండి.. ఏఐసీసీ చీఫ్ ఖర్గేతో చిన్నారెడ్డి భేటీ
న్యూఢిల్లీ, 20 ఫిబ్రవరి (హి.స.) ఏఐసీసీ చీఫ్ , రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష నాయకులు మల్లికార్జున ఖర్గేతో రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి భేటీ అయ్యారు. శుక్రవారం న్యూఢిల్లీలోని ఇందిరా భవన్లో జరిగిన ఈ భేటీలో ఖర్గేకు బొకే ఇ
మల్లికార్జున కరిగే


న్యూఢిల్లీ, 20 ఫిబ్రవరి (హి.స.)

ఏఐసీసీ చీఫ్ , రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష నాయకులు మల్లికార్జున ఖర్గేతో రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి భేటీ అయ్యారు. శుక్రవారం న్యూఢిల్లీలోని ఇందిరా భవన్లో జరిగిన ఈ భేటీలో ఖర్గేకు బొకే ఇచ్చి తెలంగాణ రాష్ట్ర తాజా రాజకీయ పరిస్థితులను చిన్నారెడ్డి వివరించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ 70 శాతం స్థానాలను, మున్సిపల్ ఎన్నికల్లో 90 శాతం స్థానాలను కైవసం చేసుకుని కాంగ్రెస్ పార్టీ ప్రభంజనాన్ని కొనసాగించిందని, రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో, ఇతర ఏ ఎన్నికలు వచ్చిన కూడా ఇదే ఉత్సాహంతో ముందుకు సాగుతామని ఖర్గేకు చిన్నారెడ్డి వివరించారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు సమిష్టిగా చేస్తున్న కృషిని మల్లికార్జున్ ఖర్గే అభినందించారని చిన్నారెడ్డి తెలిపారు. రెండేళ్ల కిందట జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వనపర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ బీ ఫారంను తాను వెనక్కి ఇచ్చే సమయంలో తనను రాజ్యసభ సభ్యునిగా అవకాశం ఇస్తామని అధిష్టానం హామీనిచ్చిన విషయాన్ని చిన్నారెడ్డి ఏఐసీసీ చీఫ్ ఖర్గే దృష్టికి తెచ్చారు. తనకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఖర్గేను చిన్నారెడ్డి కోరారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande