
అమరావతి, 20 ఫిబ్రవరి (హి.స.)వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు అజ్ఞాతంలోకి వెళ్లారు. డ్రైవర్ హత్య కేసులో అనంతబాబు భార్యపై సిట్ ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలోనే గన్‌మెన్లు, వ్యక్తిగత సిబ్బంది లేకుండా మండలి నుంచి ఆయన అర్ధంతరంగా వెళ్లిపోయారు. ఇప్పటికే ఆయన భార్య లక్ష్మీదుర్గ కోసం పోలీసులు గాలిస్తున్నారు. దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హత్యలో వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబుతో పాటు ఆయన భార్య అనంత లక్ష్మీ దుర్గ అలియాస్ రోజా కూడా పాల్గొన్నారని సిట్ తేల్చింది. ఈ హత్యకు ప్రేరేపించటమే కాకుండా ఈ నేరంలో అనంతబాబుకు అన్ని విధాలా ఆమె సహకరించారని నిర్ధారించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్