
అమరావతి , 20 ఫిబ్రవరి (హి.స.)వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో నారా లోకేశ్ మాట్లాడుతూ.. ‘శ్రీవారికి చేసిన మహాపాపం కప్పిపుచ్చుకోవడానికి మహాపరాధం చేశావు జగన్. మీకు దేవుడంటే భక్తి లేదు, భయం లేదు. హిందువుల మనోభావాలంటే లెక్కే లేదు. మీ వైసీపీ ఎమ్మెల్సీలు బూట్లు, చెప్పులతో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి చిత్రపటాలు పట్టుకుని మహాపరాధం చేశారు. అంతే కాకుండా కౌన్సిల్‌లో ప్రదర్శించిన శ్రీవారి ఫొటోలను అక్కడే విసిరేసి వెళ్లిపోవడం క్షమించరాని పాపం. వెంకన్న స్వామితో పెట్టుకోవద్దు జగన్’ అని నారా లోకేశ్ ధ్వజమెత్తారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్