అందుకే మీకు చులకనయ్యాం.. అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఫైర్
హైదరాబాద్, 20 ఫిబ్రవరి (హి.స.) బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రెడ్డి, కాపు, వెలమ ఎవరైనా తన కాళ్ల దగ్గరకు రావాల్సిందేనని ఎంఐఎం పార్టీ నేత, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై రాకేష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్బరుద
ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి


హైదరాబాద్, 20 ఫిబ్రవరి (హి.స.)

బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సంచలన

వ్యాఖ్యలు చేశారు. రెడ్డి, కాపు, వెలమ ఎవరైనా తన కాళ్ల దగ్గరకు రావాల్సిందేనని ఎంఐఎం పార్టీ నేత, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై రాకేష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్బరుద్దీన్ హిందువులను హీనంగా మాట్లాడుతున్నారని అన్నారు. సిగ్గు శరం లేదని జాతి హిందువులదని అన్నారు. రెడ్డి, కాపు, వెలమ అంటూ కులాలతో విడిపోయారని అదే మీకు చులక అయ్యిందన్నారు. కానీ ఇప్పుడు హిందువులుగా మారుతున్నామని చెప్పారు. చత్రపతి శివాజీ స్పూర్తితో హిందువులగానే ఉంటామన్నారు. ఇంకా హిందువులను తిట్టాలని చీము నెత్తురు లేని జాతిని తిడితేనే ఏకం అవుతారని అన్నారు. హిందువులను ఓవైసీ పాములు అంటున్నాడని.. పాములైతేనే మీరు 3కోట్లనుండి 20 కోట్లు అయ్యారా అని ప్రశ్నించారు.

మీరు పాములు కాబట్టే పాకిస్తాన్, బంగ్లాదేశ్ లో హిందులపై దాడులు చేశారని మండిపడ్డారు. అక్కడ పాములై కరుస్తున్నారని అన్నారు. ఇక్కడ ప్రేమతో చేరదీస్తే కాటు వేస్తున్నారని అన్నారు. ఒవైసీ బ్రదర్స్ అంటేనే హిందులకు బద్ధ శత్రువులు అని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే ఇటీవల కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం అక్బరుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రులు రెడ్డి అయినా, రావు అయినా తమ వద్దకే రావాలని అన్నారు. ముఖ్యమంత్రుల వద్దకు తామకు వెళ్లమని చెప్పారు. పనులు కావాలన్నా, అధికారం కావాలన్నా సీఎంలే రావాలన్నారు. తమ మద్దతు లేకుండా రాజకీయాలు చేయడం సాధ్యం కాదని వ్యాఖ్యానించారు. ఎంఐఎం మద్దతు రాష్ట్రంలో కేవలం ఒక ప్రాంతానికి పరిమితం కాదని, తెలంగాణ రాజకీయాలను ప్రభావితం చేసే శక్తి తమ పార్టీకి ఉందన్నారు.

---------------

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande