
హైదరాబాద్, 20 ఫిబ్రవరి (హి.స.)
ఇటీవల హైదరాబాద్ నాంపల్లి సీబీఐ
కోర్టుకు వరుస బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది. బాంబు స్క్వాడ్ తనిఖీలు చేసి.. అదంతా ఫేక్ అని తేల్చేవారు. తాజాగా మళ్లీ నాంపల్లి సీబీఐ కోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. అప్రమత్తమైన పోలీసులు, బాంబ్ స్క్వాడ్ కోర్టుకు చేరుకుని సిబ్బందిని ఖాళీ చేయించి తనిఖీలు చేపట్టారు. రెండ్రోజుల క్రితం కూడా ఇదే తరహా బాంబు బెదిరింపు మెయిల్ వచ్చిన విషయం తెలిసిందే. ఆ బెదిరింపులకు పాల్పడింది తమిళనాడుకు చెందిన పోలీసులని, తమకు ఉన్న వేధింపుల కారణంగానే ఏం చేయాలో తెలియక కోర్టులను టార్గెట్ చేసుకుని ఇలా బెదిరింపులకు పాల్పడినట్లు తెలిసింది. తాజాగా మెయిల్ ను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఆ మెయిల్ ఎవరు పంపారు ? ఎక్కడి నుంచి వచ్చిందని తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు