అమీర్పేటలో అగ్నిప్రమాదం.. 50 మందికి పైగా సేఫ్.. హైడ్రా కమిషనర్ కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్, 20 ఫిబ్రవరి (హి.స.) హైదరాబాద్లో మరో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఫైర్ ఎక్స్టింగ్విషర్ ద్వారా మంటలను క్షణాల్లో నియంత్రించి అందులో చిక్కుకున్న 50 మందికి పైగా ఉన్నవారిని హైడ్రా శుక్రవారం కాపాడింది. అమీర్పేటలోని ఆదిత్య ఎన్క్లేవ్లోని నీలగిరి
Fire accident


హైదరాబాద్, 20 ఫిబ్రవరి (హి.స.) హైదరాబాద్లో మరో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఫైర్ ఎక్స్టింగ్విషర్ ద్వారా మంటలను క్షణాల్లో నియంత్రించి అందులో చిక్కుకున్న 50 మందికి పైగా ఉన్నవారిని హైడ్రా శుక్రవారం కాపాడింది. అమీర్పేటలోని ఆదిత్య ఎన్క్లేవ్లోని నీలగిరి బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్లో విద్యుత్ కేబుళ్లున్న ప్యానల్ బోర్డులో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. క్షణాల్లో ఫీల్డ్ మీద ఉన్నహైడ్రా డీఆర్ఎఫ్ బృందాలకు హైడ్రా కంట్రోల్ రూం సిబ్బంది చేర్చారు. ఆ చేరువలో ఉన్న హైడ్రా డీఆర్ ఎఫ్ సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని ఫైర్ ఎక్స్టింగ్విషర్ల ద్వారా మంటలను నియంత్రించినట్లు తెలిపారు. ఒక పక్క మంటలను అదుపులోకి తెస్తూనే హైడ్రా డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. ఇంతలో మరో రెండు బృందాలు అక్కడకు చేరుకున్నాయి. వీరితో పాటు.. ఫైర్, పోలీసు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. మెట్ల మార్గం వద్దే కరెంటు కేబుళ్లు తగలపడడం.. పొగలు కమ్మేయడంతో అంతస్తులో చిక్కుకున్న వారిని హైడ్రా డీఆర్ఎఫ్ వద్ద సిద్ధంగా ఉన్న రోప్ ల్యాడార్ల ద్వారా కిందకు దించారు. ఇలా మంటలనార్పడం.. వెంటనే సహాయక చర్యలు ప్రారంభమవ్వడంతో ఎవరికీ ఎలాంటి ప్రాణహాని కలగలేదు. మంటలనార్పడం ఏమాత్రం ఆలస్యం అయినా..పెను ప్రమాదం సంభవించేది.

అగ్ని ప్రమాదం జరిగిన ఘటనా స్థలిని హైడ్రా కమిషనర్ ఏ వీ రంగనాథ్ పరిశీలించారు. మంటలు వ్యాపించడానికి గల కారణాలను ఆరా తీశారు. క్షణాల్లో హైడ్రా డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పిందన్నారు. ఫైర్, పోలీసు విభాగాలు స

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande