ఎల్బీనగర్‌ చట్నీస్‌ హోటల్‌లో పేలుడు
ఎల్బీనగర్‌ చట్నీస్‌ హోటల్‌లో పేలుడు సంభవించింది.
Chutneys restaurant


హైదరాబాద్, 20 ఫిబ్రవరి (హి.స.)ఎల్బీనగర్‌ చట్నీస్‌ హోటల్‌లో పేలుడు సంభవించింది. పేలుడు శబ్దానికి వినియోగదారులు పరుగులు తీశారు. ఈ ఘటనలో ముగ్గురు సిబ్బందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇడ్లీ స్టీమర్‌లో పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న ఎల్బీనగర్‌ పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. అధిక వేడికి కారణంగానే స్టీమర్‌ పేలిపోయినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande