
ముంబయి, 20 ఫిబ్రవరి (హి.స.)
మెగాస్టార్ చిరంజీవి తాజాగా మన
శంకర వరప్రసాద్ గారు అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో ప్రేక్షకులను పలకరించాడు. నయనతార ఇందులో హీరోయిన్గా నటించగా, విక్టరీ వెంకటేష్ ఓ కీలకమైన పాత్రలో నటించాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించగా, షైన్ స్క్రీన్, గోల్డ్ బాక్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మించారు. ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12వ తేదీన విడుదల అయిన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది.
300 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి రీజనల్ ఇండస్ట్రీ హిట్టుగా నిలిచింది. బాక్సాఫీస్ దగ్గర ఘన విజయం సాధించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కొన్ని రోజుల క్రితమే జీ5 ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ కూడా ఈ సినిమా రికార్డుల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలో 500 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ను అందుకున్నట్లు ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటించారు.
ఈ చిత్రం ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ సమయంలోనే ఈ రేర్ ఫీట్ను టచ్ చేయడంతో మరికొన్ని రోజుల్లో ఇంకెన్ని రికార్డులను సృష్టిస్తుందో అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా మరికొన్ని రోజుల్లోనే జీ తెలుగు ఛానల్లో ప్రసారం కాబోతున్నట్లు తెలుస్తుంది. అక్కడ కూడా ఈ చిత్రం సరికొత్త రికార్డులను సృష్టిస్తుందని మెగా అభిమానులు గట్టి నమ్మకంతో ఉన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు