
హైదరాబాద్, 20 ఫిబ్రవరి (హి.స.) యాదాద్రి భువనగిరి జిల్లాలో కొలువై ఉన్న మహిమాన్విత యాదగిరి గుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామి తిరుకళ్యాణ మహోత్సవానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుటుంబo ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు అందజేసింది. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతి ఏటా జరిగే తిరు కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కుటుంబం సాంప్రదాయబద్ధంగా గత 15ఏళ్లుగా స్వామివారికి, అమ్మవారికి, ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పిస్తున్నారు. ఈనెల 25న జరిగే తిరుకళ్యాణ మహోత్సవానికి ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు శుక్రవారం హైదరాబాద్ నివాసంలో అందజేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు