
హైదరాబాద్, 20 ఫిబ్రవరి (హి.స.)
తెలంగాణ కాంగ్రెస్లో (Telangana Congress) మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) వ్యవహారం రోజురోజుకు ముదురుతోంది. తన మంత్రి పదవి విషయంలో సందర్భం వచ్చిన ప్రతిసారి పార్టీని దెబ్బిబొడుస్తున్న ఆయన తన వ్యాఖ్యలతో పార్టీకి కంటిలో నలుసులా మారిందనే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో నిన్న ఏఐసీసీ పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) మంత్రుల పర్యటన సందర్భంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంశంపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. త్వరలోనే రాజగోపాల్ రెడ్డిని ఢిల్లీకి పిలిపించుకుని అధిష్టానం మాట్లాడబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే రాష్ట్ర నేతల ఢిల్లీ పర్యటన వేళ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ఈసారి ఏకంగా ఏఐసీసీ (AICC) పెద్దలపైనే ఆరోపణలు చేయడం టీకాంగ్రెస్లో అసలేం జరుగుతోందనే డిస్కషన్ నడుస్తోంది.
తాజాగా ఓ యూట్యూబ్ చానల్తో మాట్లాడిన మాట్లాడిన రాజగోపాల్ రెడ్డి.. బీజేపీని వీడి కాంగ్రెస్లో చేరినప్పుడు నాకు మంత్రి పదవి ఆఫర్ చేశారని ఆ మాటను పార్టీ నిలబెట్టుకుంటుందా లేదా అనేది తర్వాత విషయం. కానీ పార్టీ అధికారంలోకి వచ్చాక ఈ రెండేళ్లుగా తనను పార్టీలోకి తీసుకువచ్చిన సునీల్ కనుగోలు, భట్టి విక్రమార్క, మాణిక్ రావు థాక్రే, మహేశ్ కుమార్ గౌడ్ వంటి నేతలు తన పట్ల ప్రవర్తించిన తీరు అవమానకరంగా ఉందన్నారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కేసీ వేణుగోపాల్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి సీటు సాధిస్తే మీకిచ్చిన హామీని నెరవేరుస్తామని మాట ఇచ్చారని చెప్పారు. తనకు చాలా ఇచ్చిన ప్రామిస్ నెరవేర్చడంలో కాంగ్రెస్ పార్టీకి, అధిష్టానానికి ఇబ్బందులు ఉండవచ్చు. కానీ వారు తన పట్ల మాట్లాడిన పద్ధతి, ప్రవర్తించిన తీరు మంత్రి పదవి ఇవ్వలేకపోతున్నామనే విషయాన్ని కనీసం పిలిచి చెప్పకపోవడం దుర్మార్గం అని ఆవేదన వ్యక్తం చేశారు. అందరూ అనుకుంటున్నట్లు నా సమస్య మంత్రి పదవికోసం కాదన్నారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు