
వరంగల్, 20 ఫిబ్రవరి (హి.స.)
కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పొట్ట కొడుతుంది అని ప్రభుత్వ మాజీ చీప్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. శుక్రవారం భద్రకాళి దేవస్థానం వద్ద ఉన్న చెరబండ రాజుల కాలనీవాసులతో కలిసి వినయ్ భాస్కర్ మీడియాతో మాట్లాడుతూ అధికారం ఉంది కదా అని అభాగ్యులకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోం అన్నారు. కాంగ్రెస్ రెండేళ్ల పాలన నీచమైన పాలన కొనసాగిస్తోంది. దళితులను దూషిస్తోంది, దళిత నాయకులను అరెస్ట్ చేస్తున్నారు, దాడులు చేస్తున్నారు. ఎన్నికల వరకే రాజకీయం కానీ కాంగ్రెస్ నాయకులు ప్రజా సంక్షేమం మరిచి నిరంతరం రాజకీయాలు చేస్తున్నారు అన్నారు. గుడిసెలు వేసుకొని ఉండడం తప్పా రాజ్యాంగం పై అవగాహన లేని వ్యక్తి ఎమ్మెల్యేగా ఉండి పేదలను తీవ్ర ఇబ్బందులు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పేదల పొట్ట కొట్టేందుకు ప్రయత్నిస్తుంటే కాలనీవాసులకు రాష్ట్ర మానవ కమిషన్ అండగా నిలిచింది అన్నారు. వినయ్ భాస్కర్ అధికారం ఉన్నా లేకున్నా ప్రజలతోనే ఉంటాడు ప్రజల తరఫున పోరాడుతా..బడుగు బలహీన వర్గాలకు అన్ని వర్గాలకు అండగా ఉంటాను అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు