వరంగల్ మార్కెట్ లో నిలకడగా మిర్చీ ధర..
వరంగల్, 20 ఫిబ్రవరి (హి.స.) వరంగల్ ఎనుమాముల మార్కెట్ లో మిర్చి ధర నిలకడగా కొనసాగుతుంది. గత సంవత్సరం కంటే ఈ ఏడాది ధర ఎక్కువగా పలుకుతుంది. పంట విస్తీర్ణం తగ్గడం, వర్షాలకు దిగుబడి తగ్గడం వల్ల రోజురోజుకు ధర పెరుగుతుంది. వండర్ హాట్ రకానికి శుక్ర వారం క
వరంగల్ మార్కెట్


వరంగల్, 20 ఫిబ్రవరి (హి.స.)

వరంగల్ ఎనుమాముల మార్కెట్ లో మిర్చి ధర నిలకడగా కొనసాగుతుంది. గత సంవత్సరం కంటే ఈ ఏడాది ధర ఎక్కువగా పలుకుతుంది. పంట విస్తీర్ణం తగ్గడం, వర్షాలకు దిగుబడి తగ్గడం వల్ల రోజురోజుకు ధర పెరుగుతుంది. వండర్ హాట్ రకానికి శుక్ర వారం క్వింటాలుకు 37 వేలకు అమ్మకాలు జరిగాయి. వండర్ హాట్ తో పాటు యూఎస్ 341కు కూడా ధర పెరిగింది. ఇతర మిర్చీ రకాలకు కూడా ఎక్కువ ధరకు అమ్ముడు అవుతున్నాయి. మార్కెట్ లో గురువారం వండర్ హాట్ కు సరాసరి కనిష్ట ధర 13,500 రూపాయలు పలుకగా, గరిష్ట ధర క్వింటాలుకు 37 వేల రూపాయలు పలికింది. మోడల్ ధర క్వింటాలుకు 26వేల రూపాయల వరకు ఉంది. తేజా మిర్చీకి కనిష్ట ధర 12,500 రూపాయలు ఉండగా, గరిష్ట ధర 18,000 రూపాయలు పలికింది. యూఎస్ 341కు కనిష్ట ధర 12,500 రూపాయలు ఉండగా గరిష్ట ధర 25,000 రూపాయలు పలికింది. దేశీ రకం మిర్చీ క్వింటాలుకు 37000 వేల రూపాయలు పలికింది. మార్కెట్ కు శుక్రవారం 14750 బస్తాలు వచ్చింది. ---------------

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande