
నాగర్ కర్నూల్, 20 ఫిబ్రవరి (హి.స.) తెలంగాణ రాష్ట్రంలో రైతులకు మళ్లీ యూరియా కష్టాలు ప్రారంభమైనవి.
యూరియా కోసం రైతులు నాగర్ కర్నూల్ జిల్లా పెద్ద కొత్తపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం కార్యాలయం ముందు శుక్రవారం ధర్నా చేశారు. సొసైటీకి ఇవాళ ఉదయం 900 బస్తాల యూరియా వచ్చిన విషయం తెలుసుకొని రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అయితే యూరియా కోసం ఆన్ లైన్ యాప్ చేసుకోవడానికి తమ స్మార్ట్ ఫోన్లు కావని, దీని కారణంగా తాము ఇబ్బందులు పడుతున్నామని రైతులు వాపోయారు.
ప్రభుత్వం పాస్ బుక్ల ప్రకారమే(పాత విధానం) యధావిధిగా అమలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సొసైటీ కార్యాలయానికి చేరుకొని ఆందోళన చేస్తున్న రైతుల డిమాండ్ను విన్నారు. మీ డిమాండ్ ను ఆ శాఖ జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు. దీంతో రైతులు ఆందోళన విరమించుకున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు