
షాద్నగర్, 20 ఫిబ్రవరి (హి.స.)
ప్రతి పేదవాడికి సొంతింటి కల నిజం
చేయడమే ప్రభుత్వ లక్ష్యమని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. శుక్రవారం నందిగామ మండలంలోని జంగోనిగూడా గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల గృహప్రవేశ కార్యక్రమానికి ఎమ్మెల్యే శంకర్ ముఖ్య అతిథిగా హాజరై, ఇందిరమ్మ ఇంటికి రిబ్బన్ కట్ చేసి లంచనంగా ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, ఇచ్చిన మాట ప్రకారం అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత సీఎం రేవంత్ రెడ్డికి దక్కిందన్నారు. పేదోడికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జంగా నర్సింహ, మాజీ ఎంపీపీ శివశంకర్ గౌడ్, సర్పంచులు కొమ్ము కృష్ణ, మంకాల శ్రీశైలం, నరసింహ, కుమార్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు