పట్టణ ప్రగతికి బడ్జెట్ బాట.. ఆదాయ మార్గాలపై నజర్
హైదరాబాద్, 20 ఫిబ్రవరి (హి.స.) మున్సిపల్ ఎన్నికలు జరిగి కొత్త పాలకవర్గాల కొలువు దీరాయి. ఈ క్రమంలో మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల నిర్వహణకు వార్షిక బడ్జెట్ తప్పనిసరి. దీంతో వార్షిక బడ్జెట్ రూపకల్పనకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. మేయర్లు
Municipal


హైదరాబాద్, 20 ఫిబ్రవరి (హి.స.)

మున్సిపల్ ఎన్నికలు జరిగి కొత్త పాలకవర్గాల కొలువు దీరాయి. ఈ క్రమంలో మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల నిర్వహణకు వార్షిక బడ్జెట్ తప్పనిసరి. దీంతో వార్షిక బడ్జెట్ రూపకల్పనకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. మేయర్లు, చైర్మన్లతో చర్చించి ప్రతిపాదనలు తయారుచేయడానికి చర్యలు ప్రారంభించారు. ప్రతిపాదనలు రూపొందించిన తర్వాత బడ్జెట్ ఆమోదించడానికి స్పెషల్ కౌన్సిల్ సమావేశాన్ని సైతం ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. బడ్జెట్ ప్రక్రియ పూర్తిచేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

రాష్ట్రంలో 133 యూఎల్బీలు..

131 రాష్ట్రంలో 12 మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటిలో జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీలను మినహాయిస్తే 130 పట్టణ స్థానిక సంస్థలు ఉన్నాయి. ప్రస్తుతం ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. కొత్త పాలకవర్గాలు సైతం కొలువుదీరాయి. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్, అచ్చంపేట, సిద్దిపేట, జడ్చర్ల, కొత్తూరు, నకిరేకల్ మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande