'నా అన్వేషణ' కు మరో షాక్.. యూట్యూబ్ ఛానెల్ కూడా బ్లాక్ కానుందా?
హైదరాబాద్, 20 ఫిబ్రవరి (హి.స.) ప్రపంచ యాత్రికుడు అన్వేష్ గురించి తెలియని వారు ఉండరు. ఏపీకి చెందిన అన్వేష్, కరోనా సమయంలో యూట్యూబ్ ద్వారా బాగా పాపులర్ అయ్యాడు. అంతకు ముందు పెద్ద షిప్పుల్లో పనిచేసిన అన్వేష్ ఆ తర్వాత, ట్రావెలర్ గా సెటిల్ అయ్యాడు. అయ
యూట్యూబర్


హైదరాబాద్, 20 ఫిబ్రవరి (హి.స.)

ప్రపంచ యాత్రికుడు అన్వేష్ గురించి

తెలియని వారు ఉండరు. ఏపీకి చెందిన అన్వేష్, కరోనా సమయంలో యూట్యూబ్ ద్వారా బాగా పాపులర్ అయ్యాడు. అంతకు ముందు పెద్ద షిప్పుల్లో పనిచేసిన అన్వేష్ ఆ తర్వాత, ట్రావెలర్ గా సెటిల్ అయ్యాడు. అయితే ఎక్కువ శాతం విదేశాల్లోనే ఉండే అన్వేష్, ఈ మధ్య హిందూ మతాన్ని కించపరుస్తూ రెచ్చిపోయాడు. హిందూ దేవుళ్లను టార్గెట్ చేస్తూ అసభ్యకర వీడియోలు కూడా పెట్టాడు.

ఈ నేపథ్యంలోనే ప్రపంచ యాత్రికుడు అన్వేష్ పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. ప్రముఖ సినీనటి కరాటే కళ్యాణి ఫిర్యాదు మేరకు.. ఈ కేసు బుక్ చేశారు పోలీసులు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అన్వేష్ పై హిందూ సంఘాలు ఫిర్యాదు చేశాయి. ఇలాంటి నేపథ్యంలోనే అతడి ఇనిస్టాగ్రామ్ అకౌంట్ ఐడీని తొలగించాలని మెటా సంస్థకు హైదరాబాద్ పోలీసులు లేఖ కూడా రాశారట. ఈ నేపథ్యంలోనే తాజాగా అన్వేష్ కు సంబంధించిన ఇనిస్టాగ్రామ్ అకౌంట్ పై బ్యాన్ కూడా విధించారు. దీంతో అతనికి తీవ్ర నష్టం ස0යි.

యూట్యూబ్ ఛానల్ కూడా బ్లాక్ కానుందా ?

ప్రపంచ యాత్రికుడు అన్వేష్ ఇనిస్టాగ్రామ్ అకౌంట్ ను మెటా బ్లాక్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సంఘటనపై బీజేపీ నేత కరాటే కళ్యాణి కీలక వ్యాఖ్యలు చేశారు. అన్వేష్ యూట్యూబ్ ఛానల్ సహా అన్ని అకౌంట్లను డిలీట్ చేయాలని సీపీ సజ్జనార్ ను కలవబోతున్నట్లు కీలక ప్రకటన చేశారు. అలాగే పాస్ పోర్ట్, బ్యాంక్ అకౌంట్ సీజ్ చేయాలని కోరుతామని వివరించారు. హిందువులను అన్వేష్ అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్వేష్ కు జైలు శిక్ష పడేలా

చూస్తామని ప్రకటన చేశారు. దీంతో అన్వేష్ యుట్యూబ్ ఛానల్ కూడా బ్లాక్ అవుతుందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande