నా ఇద్దరు అల్లుళ్లు కమ్మవాళ్లే.. అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు
అమరావతి, 20 ఫిబ్రవరి (హి.స.) జైలు నుండి బ‌య‌ట‌కు వ‌చ్చిన మాజీ మంత్రి అంబ‌టి వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని క‌లిశారు. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. చంద్రబాబును తాను ఉద్దేశపూర్వకంగా తిట్ట‌లేద‌ని చెప్పారు. అవ‌త‌ల‌వాళ్లు తన‌ను తిడుతున్నార‌
అంబటి రాంబాబు


అమరావతి, 20 ఫిబ్రవరి (హి.స.)

జైలు నుండి బ‌య‌ట‌కు వ‌చ్చిన మాజీ మంత్రి అంబ‌టి వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని క‌లిశారు. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. చంద్రబాబును తాను ఉద్దేశపూర్వకంగా తిట్ట‌లేద‌ని చెప్పారు. అవ‌త‌ల‌వాళ్లు తన‌ను తిడుతున్నార‌నే క్ష‌ణికావేశంలో తిట్టాన‌ని అన్నారు. ఈ వ‌య‌సులో తాను అలా తిట్టి ఉండాల్సింద‌ని చెప్పారు. తిట్టినందుకు తాను ప‌శ్చాత్తాప‌డ్డాన‌ని.. ప‌శ్చాత్తాపానికి మించిన ప్రాయిశ్చిత్తం లేద‌ని అన్నారు. త‌న‌కు బెయిల్ రాకుండా ఉండేందుకు వంశీ అనే వ్య‌క్తి కుట్ర చేశార‌న్నారు. తాను క‌మ్మ‌వారిని తిట్టిన‌ట్టు రిమాండ్ రిపోర్టులో రాశార‌న్నారు.

త‌న కుటుంబంలో 8మంది ఉన్నార‌ని వారిలో న‌లుగురు కాపులు అయితే న‌లుగురు క‌మ్మ‌వార‌ని అన్నారు. త‌న‌ ఇద్ద‌రు అల్లుల్లు క‌మ్మ‌వాళ్లేన‌ని చెప్పారు. తాను కులం పేరుతో ఎందుకు దూషిస్తాన‌ని అన్నారు. 24 గంటల్లో సినిమా చూపిస్తానని కేంద్ర మంత్రి పెమ్మసాని అన్నారని చెప్పారు. 18 రోజులు సినిమా చూపించార‌ని, త‌న ఇల్లు, కార్లు ధ్వంసం చేసి సినిమా చూపించార‌ని అన్నారు. ఇంత‌పెద్ద సినిమాలో హీరో ఎవ‌రు అని ప్ర‌శ్నించారు. ఇంత‌పెద్ద సినిమా తీసి మీరు విల‌న్లు అయ్యార‌ని వ్యాఖ్యానించారు.

అసహ్యంగా మాట్లాడినందుకే దాడులు జరుగుతున్నాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటున్నార‌న్నారు. అస‌హ్యంగా మాట్లాడితే దాడులు జ‌రుగుతాయా అని ప‌వ‌న్ ను ప్ర‌శ్నించారు. అస‌హ్యంగా మాట్లాడితే కేసులు పెట్ట‌రా అని అడిగారు. మీరు ఎప్పుడూ అస‌హ్యంగా మాట్లాడ‌లేదా అని ప్ర‌శ్నించారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ వైసీపీ ఎమ్మెల్యే నా కొడ‌క‌ల్లారా అంటూ చెప్పు పైకి తీయ‌లేదా అని అన్నారు. అది కూడా క్ష‌ణికావేశంలో కాద‌ని అంద‌రి ముందు జ‌న‌సేన స‌భలో అన్నారని చెప్పారు. అన్యాయాన్ని అన్యాయం అని చెప్ప‌లేన‌ప్పుడు నీకు చంద్ర‌బాబుకు తేడా ఏంటి అని ప్ర‌శ్నించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande