2027 జూన్ 26 నుంచి గోదావరి పుష్కరాలు : మంత్రి నిమ్మల
అమరావతి, 20 ఫిబ్రవరి (హి.స.) 2027 జూన్ 26వ తేదీ నుంచి గోదావరి పుష్కరాలు ప్రారంభమవుతాయని ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అసెంబ్లీలో వెల్లడించారు. ఉదయం ప్రశ్నోత్తరాల సమయంలో గోదావరి పుష్కరాలపై ఎమ్మెల్యే నల్లమిల్లి ప్రశ్నకు ఆయన సమాధానమిచ్
అసెంబ్లీ


అమరావతి, 20 ఫిబ్రవరి (హి.స.)

2027 జూన్ 26వ తేదీ నుంచి గోదావరి పుష్కరాలు ప్రారంభమవుతాయని ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అసెంబ్లీలో వెల్లడించారు. ఉదయం ప్రశ్నోత్తరాల సమయంలో గోదావరి పుష్కరాలపై ఎమ్మెల్యే నల్లమిల్లి ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. గోదావరి పుష్కరాల నిర్వహణకు డ్రెయిన్లతో పాటు పారిశ్రామిక కాలుష్యంతో కూడా ఇబ్బందులు ఉన్నాయని, రాజమండ్రిలో అఖండ గోదావరిగా పిలుచుకునే నది పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపారు.

జంతు కళేబరాలు, పౌల్ట్రీ వ్యర్థాలను కూడా నదినీటిలో కలిపేస్తున్నారని, అలాంటి వారిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు. ఘాట్లలో స్నాన కార్యక్రమాల నిర్వహణ, వ్యర్థాలను నదిలో పడేయకుండా నియంత్రణ చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని మంత్రి వెల్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande