సమయం సందర్భం ఉండక్కర్లేదా? Al సమ్మిట్లో కాంగ్రెస్ నిరసనలపై కేటీఆర్ విమర్శలు
హైదరాబాద్, 21 ఫిబ్రవరి (హి.స.) కాంగ్రెస్ పార్టీ యొక్క సహజ మూర్ఖత్వం కృత్రిమ మేధస్సును (Artificial Intelligence) మించిపోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. అంతర్జాతీయ వేదికపై రాజకీయ నాటకాలు తగవని కాంగ్రెస్పై (Congress)
కేటీఆర్


హైదరాబాద్, 21 ఫిబ్రవరి (హి.స.)

కాంగ్రెస్ పార్టీ యొక్క సహజ మూర్ఖత్వం కృత్రిమ మేధస్సును (Artificial Intelligence) మించిపోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. అంతర్జాతీయ వేదికపై రాజకీయ నాటకాలు తగవని కాంగ్రెస్పై (Congress) మండిపడ్డారు. శనివారం కాంగ్రెస్ పై వారు విమర్శలు గుప్పించారు. ఏఐ సమిట్ వద్ద యువజన కాంగ్రెస్ నిరసనపై స్పందిస్తూ యూత్ కాంగ్రెస్ సభ్యులు తమ అల్ప రాజకీయ నాటకాల కోసం 'AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026' ను వేదికగా ఎంచుకోవడం అత్యంత విచారకరం అన్నారు. ఇలాంటి అంతర్జాతీయ వేదికలను నిరసనల కోసం ఉపయోగించడం వల్ల, ప్రపంచ దేశాల ముందు మన దేశం యొక్క ప్రతిష్ట దెబ్బతింటుందన్నారు. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలు ఉండటం సహజమే కానీ ఎక్కడ, ఎలా నిరసన తెలపాలో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం అని రాజకీయ అసమ్మతిని వ్యక్తం చేయడానికి ఒక సమయం, సందర్భం ఉంటాయన్నారు. AJ ఇంపాక్ట్ సమ్మిట్ 2026' వంటి అంతర్జాతీయ సదస్సు ఖచ్చితంగా ఇలాంటి నిరసనలకు వేదిక కాదన్నారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అదే Al సదస్సును ఉద్దేశించి ప్రసంగిస్తున్న సమయంలోనే యూత్ కాంగ్రెస్ నాయకులు ఈ నిరసన చేపట్టడం విచిత్రం అని ఎద్దేవా చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande