ఏఐ సమ్మిట్లో యూత్ కాంగ్రెస్ ఆందోళన కేసు.. నలుగురికి కస్టడీ విధించిన కోర్టు
న్యూఢిల్లీ, 21 ఫిబ్రవరి (హి.స.) ఏఐ సమ్మిట్లో (Al Summit) యూత్ కాంగ్రెస్ నాయకులు చేపట్టిన ఆందోళనపై ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో అరెస్టయిన నలుగురు నిందితులకు ఐదు రోజుల పోలీసు కస్టడీ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చ
Youth Congress


న్యూఢిల్లీ, 21 ఫిబ్రవరి (హి.స.)

ఏఐ సమ్మిట్లో (Al Summit) యూత్

కాంగ్రెస్ నాయకులు చేపట్టిన ఆందోళనపై ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో అరెస్టయిన నలుగురు నిందితులకు ఐదు రోజుల పోలీసు కస్టడీ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

దేశ రాజధానిలో జరిగిన గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సమ్మిట్ సందర్భంగా నిరసన వ్యక్తం చేసిన యూత్ కాంగ్రెస్ నాయకులపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. భద్రతా నిబంధనలను ఉల్లంఘించి ఆందోళనకు దిగారన్న ఆరోపణలతో అరెస్టయిన నలుగురు నిందితులను పోలీసులు శనివారం పటియాలా హౌస్ కోర్టులో హాజరుపరిచారు. నిందితుల నుంచి మరిన్ని వివరాలు సేకరించాల్సి ఉందని, ఈ కుట్ర వెనుక ఎవరెవరు ఉన్నారో తెలుసుకోవడానికి ఏడు రోజుల కస్టడీ కావాలని పోలీసులు కోరారు. అయితే.. వాదనలు విన్న న్యాయమూర్తి ఐదు రోజుల పోలీసు కస్టడీకి అనుమతించారు.

సమ్మిట్ వంటి అంతర్జాతీయ స్థాయిలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ప్రాంతంలోకి నిందితులు చొరబడటం తీవ్రమైన భద్రతా లోపమని పోలీసులు కోర్టుకు నివేదించారు. నిషేధిత ప్రాంతంలోకి చొరబడటం, ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించడం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినట్లు నిందితులపై కేసులు నమోదయ్యాయి. యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు నిరుద్యోగం, పెరుగుతున్న ధరలు, ఇతర రాజకీయ నిరసన తెలుపుతూ ఏఐ సమ్మిట్ జరుగుతున్న వేదిక వైపు దూసుకెళ్లే ప్రయత్నం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande