
హైదరాబాద్, 21 ఫిబ్రవరి (హి.స.) కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో శుక్రవారం రాత్రి బీజేపీ నేతలు చేపట్టిన నిరసన ఉద్రిక్తంగా మారిన విషయం తెలిసిందే. పట్టణంలోని రిలయన్స్ మార్ట్ షో రూమ్లో పనిచేస్తున్న ఓ మహిళ పట్ల ఓ వ్యక్తి అసభ్యంగా మాట్లాడాడని ఫిర్యాదు చేయడంతో హిందూ సంఘాలు ధర్నా చేపట్టాయి. మరో వర్గం రాళ్లతో దాడి చేయడంతో ఇరువర్గాలు ఆందోళనకు దిగారు. పోలీసుల ఎంట్రీతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. బీజేపీ శ్రేణులు ఆందోళన విరమించకపోవడంతో లాఠీఛార్జీ చేయాల్సిన పరిస్థితులు వచ్చాయి. తాజాగా ఈ పరిణామాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు(Ramchander Rao) స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా వీడియో విడుదల చేశారు.
'గత రాత్రి బాన్సువాడలో చోటుచేసుకున్న పరిణామాలు అత్యంత ఆందోళనకరం. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న బీజేపీ కార్యకర్తల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు తీవ్ర అభ్యంతరకరం. ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా ఆందోళనలు చేపట్టడం పౌరుల ప్రాథమిక హక్కు. పోలీసుల బలప్రయోగంతో, నిరంకుశ చర్యలతో ఆ హక్కును కాలరాయాలని చూడటం పూర్తిగా అప్రజాస్వామికం.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు