రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం.. ఢిల్లీ ఏఐసీసీ కార్యాలయం ముందు బీజేపీ భారీ నిరసన
న్యూఢిల్లీ, 21 ఫిబ్రవరి (హి.స.) ఢిల్లీలో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ (Al Impact Summit) ప్రాంగణంలో నిన్న యూత్ కాంగ్రెస్ చేసిన నిరసనకు వ్యతిరేకంగా ఇవాళ బీజేపీ దేశవ్యాప్తంగా ఆందోళనలు (BJP Protest) చేపట్టింది. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం, కాంగ్రెస్ అగ్రనేత
బిజెపి నిరసన


న్యూఢిల్లీ, 21 ఫిబ్రవరి (హి.స.)

ఢిల్లీలో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్

(Al Impact Summit) ప్రాంగణంలో నిన్న యూత్ కాంగ్రెస్ చేసిన నిరసనకు వ్యతిరేకంగా ఇవాళ బీజేపీ దేశవ్యాప్తంగా ఆందోళనలు (BJP Protest) చేపట్టింది. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం, కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ నివాసం ముట్టడికి బీజేపీ నేతలు యత్నించారు. భారీ సంఖ్యలో చేరుకున్న బీజేపీ నాయకులు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బారికేట్లను దాటి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ (Rahul Gandhi) దిష్టిబొమ్మను దహనం చేశారు. దేశ ప్రజలకు రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని ఆయనపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ ఆందోళనలతో అప్రమత్తమైన పోలీసులు నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు.

మరొవైపు రాహుల్ గాంధీకి ముంబయిలో నిరసన సెగతగిలింది. 2014 లో ఆర్ఎస్ఎస్ వేసిన పరువు నష్టం కేసులో ఇవాళ ఆయం భింవాడీ అదనపు సెషన్స్ కోర్టు ముందు హాజరయ్యారు. అయితే ఆయన ముంబయి ఎయిర్ పోర్టు నుంచి కోర్టుకు వెళ్లే దారి పొడుగునా బీజేపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశాయి. నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేశారు.

మరోవైపు హైదారబాద్ నాంపల్లిలోని గాంధీభవన్ వద్ద బీజేపీ నేతలు నిరసనలు వ్యక్తం చేశారు. గాంధీభవన్ ముట్టడికి బీజేవైఎం నేతలు, కార్యకర్తలు ప్రయత్నించారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బీజేవైఎం కార్యకర్తలు గాంధీ భవన్ వైపు దూసుకొచ్చారు. దాంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు నిరసనకారులను అదుపులోకి తీసుకుని స్థానిక పోలీసు స్టేషన్లకు తరలించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande