త్వరలోనే దేవ్ జీ, మల్ల రాజిరెడ్డి అజ్ఞాతం వీడతారు.. మల్లోజుల కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్, 21 ఫిబ్రవరి (హి.స.) మాజీ మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం మావోయిస్టు ఉద్యమానికి మనుగడ లేదని అన్నారు. ఉద్యమంలో ఉన్నవాళ్లంతా వృద్ధులైపోయారని, మావోయిస్టు పార్టీలోకి కొత్త రక్తం రావడంలేదని చె
Mavoist


హైదరాబాద్, 21 ఫిబ్రవరి (హి.స.)

మాజీ మావోయిస్టు అగ్రనేత మల్లోజుల

వేణుగోపాల్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం మావోయిస్టు ఉద్యమానికి మనుగడ లేదని అన్నారు. ఉద్యమంలో ఉన్నవాళ్లంతా వృద్ధులైపోయారని, మావోయిస్టు పార్టీలోకి కొత్త రక్తం రావడంలేదని చెప్పారు. చైనా, రష్యా సిద్ధాంతాలపై ఉనికిని బూజు కొనసాగించలేమని అభిప్రాయపడ్డారు. తనను ద్రోహి అంటున్నారని.. అలా అంటున్నవాళ్లకు కాలమే సమాధానం చెబుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ప్రజలతోనే ఉన్నానని.. ప్రజల్లోనే ఉంటానని స్పష్టం చేశారు. ప్రజలు కోరుకుంటే రాజకీయబాట పడతానని అన్నారు. తన సహచరులు మంచి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. మార్చి 31 లోగా తుపాకులను వీడతారని భావిస్తున్నట్టు తెలిపారు.

త్వరలోనే దేవ్ జీ, మల్ల రాజిరెడ్డి అజ్ఞాతం వీడతారని చెప్పారు. మిగతావాళ్లు కూడా వస్తారని అన్నారు. లొంగిపోయే ముందు ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం ముందు డిమాండ్లు పెట్టామని.. అమలుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. సోనూ దాదాగా అడవి ఉద్యమాన్ని వదిలిపెట్టానని, సాధించిన విజయాలు ఏంటనేది ప్రజల మధ్యకు వెళితే తెలుస్తుందని చెప్పారు. తాను జన్మించిన తెలంగాణకు త్వరలోనే వస్తానని అన్నారు. 1980 లో ఉన్న తెలంగాణకు, ఇప్పటి తెలంగాణకు చాలా తేడా ఉందని తెలిపారు. నాటి ఉద్యామన్ని తిరిగి తీసుకురాలేకపోయామని చెప్పారు. ఆదివాలసీలను అడిగితే తాము చేసిన పనుల గురించి చెబుతారని వ్యాఖ్యానించారు. అంతే కాకుండా అర్బన్ మావోయిజం అనేది లేదని అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande