
వరంగల్, 21 ఫిబ్రవరి (హి.స.)
వరంగల్లోని మామునూరు
ఎయిర్పోర్ట్లో ఫ్లైయింగ్ స్కూల్ ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. హైదరాబాద్లో ఎయిర్ ట్రాఫిక్ దృష్ట్యా పైలెట్ల శిక్షణకు అవసరమైన ఫ్లయింగ్ అవర్స్ లభ్యం కావడం కష్టంగా మారింది. దీంతో ప్రభుత్వం వరంగల్పై దృష్టి పెట్టి అందుకనుగుణంగా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది. దీంతో పాటు వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్లలో కార్గో సేవలు, విమానాల నిర్వహణ, మరమత్తులు, ఓవరాలింగ్(ఎంఆర్వో) సెంటర్ ను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు.
ప్రస్తుతం బేగంపేట, శంషాబాద్ ఎయిర్పోర్ట్ల నుంచి ఫ్లైయింగ్ స్కూల్స్ నడుస్తున్నాయి. అయితే శంషాబాద్, ద్, దుండిగల్లో విమానాల రాకపోకలు, బేగంపేటలో ప్రైవేటు విమానాలు, హెలికాప్టర్ సర్వీసులు పెరుగుతుండటంతో శిక్షణ పొందే వారికి ఏటీసీ నుంచి క్లియరెన్స్ రావడం కష్టం మారింది. ఫ్లయింగ్ సమయం దొరికినా అది తక్కువగా ఉంటోంది. ఈ నేపథ్యంలో శిక్షణకు అవసరమైన ఫ్లయింగ్ గంటలు పూర్తి చేయడం కష్టంగా మారుతోంది. ఎక్కువ మందికి శిక్షణ ఇవ్వలేకపోతున్నారు. రాబోయే రోజుల్లో దేశ వ్యాప్తంగా 10వేల మంది పైలెట్లు అవసరం ఉంటుందని ఇటీవలే హైదరాబాద్ లో జరిగిన వింగ్స్ ఇండియా సదస్సులో నిపుణులు ప్రకటించారు. ఈ కొరతను తీర్చడానికి వరంగల్ మామునూరు ఎయిర్పోర్ట ఫ్లయింగ్ స్కూల్స్క అనుమతులు ఇవ్వడం, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయడం ద్వారా మంచి డిమాండ్ ఉంటుందని గుర్తించారు. అదే సమయంలో హైదరాబాద్కు వరంగల్ దగ్గర ఉండటంతో శిక్షకులు పోవడం సులువు అవుతుందని విశ్లేషిస్తున్నారు. వరంగల్కు కొన్ని సంవత్సరాల వరకు కొద్ది సంఖ్యలోనే విమానాలు వస్తాయని, ఫ్లయింగ్కు ఎక్కువ సమయం దొరుకుతుందని చెబుతున్నారు. రావడం దీంతో వరంగల్ నగరం పైలెట్ల శిక్షణ శిక్షణ కేంద్రంగా మారనుందని అంచనా వేస్తున్నారు. అదే సమయంలో పైలెట్లకు తక్కువ వ్యయంలో లివింగ్ కాస్ట్ కావడం ద్వారా విద్యార్థులపై భారం తక్కువగా ఉంటుందని విశ్లేషణ చేస్తున్నారు.
వరంగల్, ఆదిలాబాద్లో కార్గో సేవలు
వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ల ద్వారా కార్గో, ఎంఆర్వో సేవలను వినియోగించుకునేలా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. తెలంగాణకు అవసరమైన దిగుమతులు, ఎగుమతులు ఇక్కడి నుంచే చేయడం ద్వారా శంషాబాద్పై ఒత్తిడి తగ్గించి రైతులకు, వ్యాపారులకు అవసరమైన సేవలను కార్గో ద్వారా అందించనున్నారు. ఈ రెండు జిల్లాలతో సమీప జిల్లాలు వ్యవసాయ ఆధారిత జిల్లాలు కావడంతో రాబోయే రోజుల్లో మంచి ఫలితాలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. విమానాల నిర్వహణ, మరమత్తులు, ఓవరాలింగ్ను ఇక్కడ చేసేందుకు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. ఇలా ఒక్కొక్కటి ఏర్పాటు చేయడం ద్వారా ఇక్కడి విమానాశ్రాయాలు అభివృద్ధి చెందుతాయని, ఏదో ఒక కార్యకలాపాలతో ఆదరణ, గుర్తింపు పొంది ఎయిర్ ట్రాఫిక్ పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్లను మరింత అభివృద్ధి చేయడం ద్వారా స్థానికంగా యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు మెరుగపడనున్నాయి. వ్యాపార రంగం సైతం వృద్ధి చెందనుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు