
హైదరాబాద్, 21 ఫిబ్రవరి (హి.స.)పైరసీ సినిమాల వెబ్సైట్ నిర్వహణ కేసులో ‘ఐబొమ్మ’ రవిని గతేడాది అరెస్ట్ చేశారు హైదరాబాద్ పోలీసులు. అప్పట్లో ఈ విషయం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. అప్పటి నుంచి ఇమ్మడి రవి బెయిల్ కోసం చాలాసార్లు కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో రవికి ఎట్టకేలకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది కోర్టు. బెయిల్ వచ్చినప్పటికీ రవికి తిప్పలు తప్పడం లేదని తెలుస్తోంది. ప్రతిరోజూ ఉదయం 11 గంటలకు సీసీఎస్ కార్యాలయానికి స్వయంగా వచ్చి సంతకం చేయాలని హైకోర్టు ఆదేశించింది.
కొన్ని నెలలుగా పరారీలో ఉన్న కారణంగా ప్రతిరోజూ ఆయన స్వయంగా పోలీసుల ముందు హాజరు కావాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఉదయం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కు వచ్చారు రవి. ప్రముఖ నిర్మాణ సంస్థలు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు ఐబొమ్మ రవిని పలు సెక్షన్ల కింద అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్