
హైదరాబాద్, 21 ఫిబ్రవరి (హి.స.)హైదరాబాద్ మెట్రో రైల్ టేకోవర్ ప్రక్రియను ఈ ఆర్థిక సంవత్సరాంతానికి పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మెట్రో టేకోవర్ కోసం ప్రభుత్వం టెక్నికల్ కన్సల్టెంట్గా ఢిల్లీ మెట్రోరైలు కార్పొరేషన్ (డీఎంఆర్సీ), ఫైనాన్స్, లీగల్ అడ్వైజర్ గా ఐడీబీఐని ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. అయితే ఫైనాన్స్, లీగల్ అంశాల్లో ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చేయడానికి ఐడీబీఐ సంస్థ స్టడీ చేసింది. ఎల్ అండ్ టీ సంస్థకు ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సిన బకాయిలు, ఇతర అంశాలకు సంబంధించిన రిపోర్టు రూపొందించడంతోపాటు ప్రభుత్వానికి అధికారులు అందజేశారు. దీని ఆధారంగానే హెచ్ఎంఆర్ఎల్, ఎల్అండ్ టీ సంస్థలు చర్చించుకుని ఒప్పందాలపై సంతకాలు చేసుకునే అవకాశముంది. ఈ నెల 23న జరిగే కేబినెట్ మీటింగ్లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. దీన్ని కేబినెట్ ఆమోదించిన వెంటనే టేకోవర్ ప్రక్రియ మరింత వేగవంతం చేసే అవకాశాలున్నాయి. మార్చి31లోగా మెట్రోరైలు ప్రాజెక్టు టేకోవర్ చేసుకోవడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..