బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలి : మంత్రి అడ్లూరి
జగిత్యాల, 21 ఫిబ్రవరి (హి.స.) జగిత్యాల జిల్లా ధర్మపురిలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో నిర్వహించే బ్రహ్మోత్సవాలకు అధికారులంతా సమన్వయంతో పని చేసి విజయవంతం చేయాలని, అలాగే బ్రహ్మోత్సవాల్లో భక్తుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి అడ్లూరి లక
మంత్రి అడ్లూరి


జగిత్యాల, 21 ఫిబ్రవరి (హి.స.) జగిత్యాల జిల్లా ధర్మపురిలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో నిర్వహించే బ్రహ్మోత్సవాలకు అధికారులంతా సమన్వయంతో పని చేసి విజయవంతం చేయాలని, అలాగే బ్రహ్మోత్సవాల్లో భక్తుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. ధర్మపురి పట్టణంలోని ఓల్డ్ టిటిడిలో లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించనున్న బ్రహ్మోత్సవాల (జాతర) ఏర్పాట్లపై శనివారం సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ ల తో కలిసి పాల్గొన్నారు. స్వామి వారి బ్రహ్మోత్సవాలకు ధర్మపురికి విచ్చేయనున్న భక్తులకు అన్ని వసతులు ఏర్పాటు చేసి భద్రత పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి ఆదేశించారు. భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, తాగునీరు, పారిశుధ్యం, వైద్య సదుపాయాలు ఇతరత్రా ఏర్పాట్లపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులకు సూచించారు. ఎక్కడెక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు మంచి దర్శనం కల్పించేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశించారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్ పర్సన్ వేముల నాగలక్ష్మి రాజు, ఆలయ చైర్మన్ జక్కు రవీందర్, సీఐ రాం నరసింహ రెడ్డి, ఎస్సైలు మహేష్, ఉదయ్, కృష్ణసాగర్ రెడ్డి, సతీష్ తదితరులు ఉన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande