అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి: మంత్రి జూపల్లి
నాగర్ కర్నూల్, 21 ఫిబ్రవరి (హి.స.) గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ, అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. శనివారం నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాప
మంత్రి జూపల్లి


నాగర్ కర్నూల్, 21 ఫిబ్రవరి (హి.స.)

గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ, అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. శనివారం నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం అంకిరావుపల్లి గ్రామంలో మంత్రి జూపల్లి విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో గ్రామంలోని పలు వార్డులను పరిశీలించి, స్థానికులతో ముఖాముఖి చర్చించారు. గ్రామస్థాయిలో విద్య, వైద్యం, విద్యుత్ సరఫరా, వ్యవసాయం, ఆర్టీసీ బస్సుల సౌకర్యం వంటి మౌలిక వసతులపై మంత్రి సుదీర్ఘంగా సమీక్షించారు. ముఖ్యంగా 'ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతిని అడిగి తెలుసుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఫలాలు అందాలని, పెండింగ్లో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రజలకు జవాబుదారీగా ఉంటూ క్షేత్రస్థాయిలో పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande