
నల్లగొండ, 21 ఫిబ్రవరి (హి.స.)
నల్లగొండ కార్పొరేషన్లో అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయన్న ప్రభుత్వ ప్రకటనలు క్షేత్రస్థాయిలో నీటి మూటలుగా మారుతున్నాయి. నల్లగొండను హైదరాబాద్లో సమానంగా స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతామని, వేలకోట్ల రూపాయలు వెచ్చిస్తున్నామని జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పదేపదే చెబుతున్నప్పటికీ, పనుల్లో నాణ్యత కరువైందన్న విమర్శలు ముఖ్యంగా రోడ్ల నిర్మాణంలో కాంట్రాక్టర్ల దోపిడీ, అధికారుల పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. క్వాలిటీ కంట్రోల్ విభాగం సరిగ్గా పనిచేయకపోవడంతో ప్రజాధనం భారీగా వృథా అవుతోందని పట్టణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెల్లువెత్తుతున్నాయి.
నల్లగొండ అభివృద్ధి కోసం సుమారు రూ.2200కోట్లతో పనులు జరుగుతున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే పట్టణంలోని కాలనీలన్నింటినీ ఆధునీకరించాలనే లక్ష్యంతో సుమారు రూ.200కోట్లకు పైగా నిధులతో సీసీ రోడ్ల నిర్మాణాన్ని చేపట్టారు. దాదాపు అన్ని డివిజన్లలో సీసీ రోడ్లు వేసి ఎక్కడా మట్టి రోడ్లు లేకుండా చర్యలు తీసుకున్నారు. అయితే, ఇంత భారీ మొత్తంలో నిధులు ఖర్చు చేసినా, నిర్మాణం జరిగిన 8 నెలలు కూడా గడవకముందే అనేక ప్రాంతాల్లో రోడ్లు అస్తవ్యస్తంగా తయారయ్యాయి.
నాణ్యతకు కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం
పాటించలేదని సీసీ రోడ్ల నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు స్పష్టంగా కనిపిస్తోంది. నిర్మాణ సమయంలో సిమెంటు మోతాదు తగ్గించడం, ఇసుకకు బదులు ఫ్లై యాష్ను అధికంగా వాడడమే రోడ్లు త్వరగా దెబ్బతినడానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. ఉదాహరణకు 19వ డివిజన్ అమూల్య కాలనీలో ఎనిమిది నెలల కింద వేసిన సీసీ రోడ్డు ఇప్పుడు 20 ఏళ్ల నాటి రోడ్డులా కంకర తేలి కనిపిస్తుంది. పెద్ద పెద్ద గుంతలు పడడంతో వాహనదారులు నిత్యం ప్రమాదాలకు గురవుతున్నారు. రోడ్ల నిర్మాణం తర్వాత పక్కన కనీసం మట్టి కూడా పోయకుండా కాంట్రాక్టర్లు వదిలేయడం వారి బాధ్యతారాహిత్యానికి అద్దం పడుతోంది.
కాంట్రాక్టర్ల నుంచి అందే భారీ కమీషన్లకు కక్కుర్తి పడి ఇంజినీరింగ్ అధికారులు పనుల తీరును గాలికి వదిలేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాంట్రాక్టర్ల నుంచి అధికారులు సుమారు 15 నుంచి 20శాతం వరకు కమీషన్లు తీసుకుంటున్నారని, అందుకే నాణ్యత లేకున్నా పట్టించుకోవడం లేదని బహిరంగ చర్చ సాగుతోంది. రాజకీయ ఒత్తిళ్లు, స్వార్థ ప్రయోజనాల కారణంగా ఇంజినీరింగ్ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. కనీసం ఇప్పటికైనా కార్పొరేషన్ అధికారులు స్పందించి, అభివృద్ధి పనుల్లో నాణ్యత పెరిగేలా చర్యలు తీసుకోవాలని, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు