FSL అగ్నిప్రమాదం.. డేటా రికవరీ సాధ్యం కాదు.. నాగ్పూర్ టీమ్ కీలక ప్రకటన
హైదరాబాద్, 21 ఫిబ్రవరి (హి.స.) నాంపల్లి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (FSL) అగ్నిప్రమాద కేసులో కీలక పరిణామం చేటుచేసుకుంది. తాజాగా ఈ అగ్నిప్రమాదంలో దగ్ధమైన ఫైల్స్ పై నాగ్ పూర్ స్పెషల్ టీమ్ కీలక ప్రకటన చేసింది. మొత్తం 1100 ఫైల్స్ దగ్ధమైనట్లు గుర్తించామ
Fire accident


హైదరాబాద్, 21 ఫిబ్రవరి (హి.స.)

నాంపల్లి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (FSL)

అగ్నిప్రమాద కేసులో కీలక పరిణామం చేటుచేసుకుంది. తాజాగా ఈ అగ్నిప్రమాదంలో దగ్ధమైన ఫైల్స్ పై నాగ్ పూర్ స్పెషల్ టీమ్ కీలక ప్రకటన చేసింది. మొత్తం 1100 ఫైల్స్ దగ్ధమైనట్లు గుర్తించామని పేర్కొంది. దగ్ధమైన ఫైల్స్ ను రికవరీకి ప్రయత్నించామని, డేటా రికవరీ చేయడం సాధ్యం కాదని తేల్చేసింది. ఫిబ్రవరి 7వ తేదీన నాంపల్లిలోని FSL భవనం మొదటి అంతస్తులో అగ్నిప్రమాదం జరగ్గా.. 50 కంప్యూటర్లు, తీవ్రమైన నేరాల్లో పోలీసులు సేకరించిన సాంకేతిక ఆధారాలను పొందుపరిచి సీజ్ చేసిన హార్డ్ డిస్కులు దగ్ధమైనట్లు నాగ్ పూర్ స్పెషల్ టీమ్ రిపోర్టులో తెలిపింది. దగ్ధమైన ఫైల్స్ లో ఒక కేసుకు సంబంధించిన కీలక ఆధారాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన శాస్త్రీయ ఆధారాలు కూడా కాలి బూడిదైనట్లు సమాచారం. దగ్ధమైన ఫైల్స్ లో ఏమేమి ఉన్నాయన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది.

FSL ల్యాబ్ రాష్ట్రంలో జరిగే నేర పరిశోధనకు సహాయం అందిస్తుంది. హత్యలు, దోపిడీలు, లైంగిక దాడులు, మోసాలు వంటి కేసులకు సంబంధించిన సాక్ష్యాధారాలు అక్కడే ఉంటాయి. ఎక్కడ ఏ నేరం జరిగినా.. అక్కడ సేకరించిన నమూనాలు, సాంకేతిక ఆధారాలను ఈ ల్యాబ్ కే తరలించి పరీక్షిస్తారు. ఫింగర్ ప్రింట్స్, బ్లడ్, హెయిర్, డీఎన్ఏ టెస్టులు చేస్తారు. తుపాకులు, బుల్లెట్లతో పాటు.. విషాలు, మత్తుపదార్థాలు, గంజాయి, డ్రగ్స్, హెరాయిన్, సంతకాలు, నకిలీపత్రాల పరిశీలన కూడా చేస్తారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande