
వరంగల్, 21 ఫిబ్రవరి (హి.స.)
రైతులు నూతన వ్యవసాయ పద్దతులను అవలంబిస్తూ అధిక అధిక దిగుబడులు సాధించాలని నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవ రెడ్డి అన్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం పరిధిలోని నల్లబెల్లి మండల కేంద్రంలో శనివారం మిర్చి రైతులకు ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో కలెక్టర్ సత్య శారద తో కలిసి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మాధవరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రసాయన ఎరువుల వాడకం తగ్గించాలని అన్నారు. అధిక మోతాదులో రసాయన ఎరువులను వాడినట్లయితే భూసారం దెబ్బతిని పంటలు పండే పరిస్థితి ఉందన్నారు. మిర్చి సాగు చేసిన రైతులు కోత అనంతరం మార్కెట్ తీసుకువచ్చేటప్పుడు తేమ లేకుండా చూసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన శాఖ అధికారులు,మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు దేవేందర్ రావు, సర్పంచ్ స్వప్న తదితరులు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు